Author Archive

Old age, a boon or a bane? (Telugu)

May 26, 2018

ఇంకొక భావ వాహిని
25-04-2018

ముసలితనము ఒక వరమా లేక శాపమా ?

రెండువైపులా పదునైన ఉద్దేశ్యాలే ,
ఉదయాన్నే సూర్యభగవానుడికి నమస్కరిస్తూ ,
నా జీవితములో ఇంకో రోజు ,
రాత్రంతా కలత నిద్రే , కారణాలు అనేకం ,
వయస్సుతో వచ్చే రోగాలకు , జీవితాంతము మందులే ,
ఇదంతా సామాన్యమే కదా వైద్యులు ప్రకారం ,
పైగా ఒక చిన్న పొగడ్త , మాకంటే మీరే ఆరోగ్యము ,
“ఆరోగ్యమే మహా భాగ్యం ” అనే సామెత కి ,
మహాభాగ్యం వైద్యులదీ , అస్పత్రులదీ , మందుల కంపెనీలదీ !
ఎప్పుడూ వెంటాడే చిన్నదిగులు ,
రోగం తో రోజులెలా గడుస్తాయి ?
ఉత్తినే దేశ సేవ చేస్తానన్నా నమ్మేట్లు లేరు ,
శరణాగతి తప్ప అన్యధా శరణం నాస్తి .

Advertisements

Bhava Vahini -1

May 14, 2018

ఇది భావ కవిత అనటం , కంటే భావ వాహిని అనటమే సమఞ్జసము గదా !
unity in diversity కి వ్యతిరేకము diversity in unity గురించి రాయటం మొదలు పెట్టాను .
అది ఈ రకంగా అయిందో చూడండి .
భావ వాహిని 3:
ఒక భారత దేశం లోనే 125 కోట్ల మంది . ప్రతి ఒక్కరికీ ఒక ఆధార్ ,
ప్రతీ జీవితము లోనూ ఒక వైవిధ్యం ,
భాషలో , యాసలో , వేషంలో , తిండిలో ,
మరి తెలివిలో , సంపదలో , తిండిలో , నివాసాల్లో ,
ఇంకా ఎన్నెన్నో !
కాని , అందరికీ ఒక అమ్మ మరి ఒక నాన్న ఉన్నారుగదా ,
పెరిగి పెద్దయ్యేందుకు ఒకరి పెంపకం ,
మళ్ళీ సంతానము కనేందుకు ఒక తోడు| ;
శ్వాస , దప్పిక , ఆకలి , హార్మోనుల ప్రభావము
అందరి మీదను కూడా ,
ఈ యానం లో ఒడిదుడుకులు ఎవరికీ తప్పవు ,
ఆశలు , అడియాసలు , ప్రేమలు , కక్షలు , కోపాలు , తాపాలు ,
బ్రతికుండేందుకు పోరాటం ,
ఏదో ఒక మతం , కులం , ఆలోచనా విధానము , లింగం ,
18 ఏళ్ళు దాటితే ఒక ఓటు కూడాను ,
శాంతి సౌభాగ్యాలు , కావాలని అందరికీ ఉంటుంది .
అందుకు మన ఓటును సరిగ్గా వాడాలి కదా

Bhava Vahini 2

May 14, 2018

మరింకో భావవాహిని

మనిషీ -నీ తప్పులేదు :

మనిషే ఒక కోరికలపుట్ట , దానికి పైన మనసు కూడా ,
అంతులేని వినియోగ సామానులు, అవసరాలు, అనవసరాలు కూడా ,
వాటికి పిచ్చి ఎక్కించే ప్రచారము,
అందులోనూ ఎడాపెడా గొంతులు కోసుకునేట్టు ,
నీ ఎంపిక లో ఎంత అయోమయం ,

పోతే, ఒకప్పుడు రాజకీయాల్లో రెండో మూడో పార్టీలే ,
సబ్బులు, కార్లు,సినిమాల్లో హీరోలు హీరోయిన్లు
అంతా వేళ్ళ మీద లెక్కే ,
ఆహార విహారాల్లో కూడా పరిమితమైన ఎంపికే ,
జీవితం లో ఒక సంతృప్తి ,
ఇప్పుడో ? ఎన్ని రకాలు ప్రతిదానికీ నూ ,
మనిషీ ! నీ తప్పు లేనే లేదు
నీ ఆవేదనకు అసంతృప్తి కి ఇదే కారణమై వుందా ?
ఆలోచించు , ఈ విష చక్రంలోనుంచి బయటికిరా.

నేను రాసిందే
అద్దంకి రామకృష్ణ
12-5-2018

 

మాటా ! నీతో మాట్లాడనా ?

January 16, 2018

7/1/2018.

మాటా ! నీతో మాట్లాడనా ?

నీ మీద నాలుగు మాటలు చెపుదామంటే

ఒక్కటీ రాదే.

నిన్ను రూపు దిద్దాలంటే ఎంత కష్టం !

రోజంతా  నీతోనే పని మాకు ,

ఒక శ్రోత గా లేక కర్త గా.

మాట మీద మాట పెరిగితే

మరో ప్రపంచ యుధ్ధమేనేమో .

ఎవరితో ఎలా మాట్లాదాలి

అది తెలిసిన వాడిదే విజయం  కదా ?

నిన్ను కూడా కొనేసేందుకు

వెనకాడరు.

ఎన్నికల్లో పార్టీలు,

టి వి , రేడియో  మాటలను లను కూడా

కొని పారేస్తున్నారు కదా.

మాటలలో  సత్యం, ప్రీతి,

మధురం, మితం అన్నీ కరువైయాయి .

అందుకేనెమో మనసు విప్పి మాట

అరుదైంది.

అంతా యాంత్రికం , మాటల

మాయాజాలం   ఈ ప్రపంచం.

One Evening Dawn in a village: Telugu Bhava Kavita

November 9, 2017

చెదురు మదురుగా, భావాలు రావడం, వాటిని

తెలుగులో చెప్పే ప్రయత్నము చేస్తున్నాను. అందులో

ఇది ఒకటి:

ఒక   వేసవి సాంధ్య

పెరటిలో నీళ్ళు జల్లి, కాగిన పుడమి తల్లి

చల్లారిన  మట్టి లోంచి  ఓ అద్భుత  సువాసన ,

పట్టు మంచం మీద, బాదం చెట్టు కింద

ఆకాశంలో  సప్త రంగులు వెదజల్లే సూరీడు ,

పక్కనే, లేగ దూడలతో సహా నెమరు వేస్తున్న

గోమాతలు సహవాస  గంధం,

అటువైపే విశ్వాసమైన ఓ

వూరికుక్క దాలిగుంటలో   ఆదమరిచి విశ్రాంతి,

పైనే చెట్టుమీద పక్షులు కడుపు నింపుకుని

గూటికి చేరిన కలకలారవాలు,

దగ్గిరే ఉన్న గుడి లోంచి

పూజ మంత్రాల   పుణ్య ధ్వనులు,

మరో వైపు , పిల్లలు ఆటలలో

మైమరిచి చేస్తున్న అల్లరి ఆనంద కేరింతలు,

 

ఆ  సమయం అసమాన్యం,  అనన్యం,

కోట్లకు కూడా  కొనలేని ఓ వేసవి సంధ్య

 

What is old age? stray thoughts in Telugu

November 9, 2017

 

ముసలితనం
వచన కవిత : అద్దంకి రామక్రిష్ణ

కొంత మనస్సు తో
కొంత వయుస్సు తో
కొంత సమాజం తో
వెరసి ఓ ముసలి జీవితం
గమ్యం, లక్ష్యం లేని జీవితం
చెప్పుకోలేని బాధలు
అంతులేని భావతరంగాలు
మన అదుపులో లేని చివరి ఘట్టం
ఈ రోజూ గాలి పీల్చుకుంటున్నాను !
రేపు కోసం వేచి వుంటున్నాను ?

7-10-2016

 

Music is another world, Telugu Bhava Kavita

November 9, 2017

వచన కవిత్వం
అద్దంకి రామక్రిష్ణ
6
అక్టోబర్ 2015

అహో! అంతు లేని మరో ప్రపంచం .

నాగరికతో పుట్టిందా లేక దేవతలు
సృష్టించిందా ప్రపంచం?
అలా మొదలైన దానికి
శబ్దమే మూలాధారం .

భాష మనుగడకు నాంది అయితే
మరి ప్రపంచం దేనికి?
ప్రకృతి తో అనుసంధానమై మరియు
జనితమైన అంతు లేని
విశ్వాన్ని ఆదరించటానికి
ఆస్వాదించటనికి మరి ఏమిటో వెనకాట

మహామహులు ఎందరో ప్రపంచాన్ని
మునిగితేలి అస్వాదించారు, ఆనందింప చేసారు
వారికి మన వందనాలు.
చెవిలో ఇయర్ఫోన్ పెట్టుకుని
ఏదో శబ్దాన్ని వింటూ మేమూ
ఉన్నాము దాంట్లో అంటే భృమే కదా?

స్వర, లయ పూరితమైన
విశ్వం లో మంచిదేమిటో
వెతకండి, దాని పుట్టు పూర్వోత్తరాలు
గ్రహించండి. అవగాహన తో వినే
శబ్దమే ఆనందాన్నికి మూలం.

ప్రపంచమలో పైపైన తేలకండి.
ఇది ఒక అంతు లేని అహో మరో ప్రపంచం!
దాని ఆరాధన, అస్వాదనే మన మనుగడకి
ముఖ్యమని గుర్తించండి.
అదే కదా సంగీత ప్రపంచం!

Top of Form

Bottom of Form

Top of Form

 

Some ideas on Walk put in Telugu

November 8, 2017

నడకా నడకా !

అడుగడునా నీకు దండాలు

అందరూ నీ గురించే తపిస్తున్నారు ,

ప్రతిరోజూ ,

నిన్ను కొలిచేందుకు వచ్చాయి “fiTbiT ” లు   .

నీ కోసం అనేక క్లబ్స్అందులో walkathan లు.

చిన్నతనము లో నీ మీద ధ్యాసే లేదు

నీ గొప్పతనము గురించి

కుప్పతిప్పల గా ఉంది సమాచారం

ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఎంత

అనే చెపుతారు .

వైద్యుడు దగ్గరికి వెళ్లినా నీ

గురించే అడుగుతారు .

నీలో ఏవో మహిమలు

ఉన్నాయంట ,

భారీ శరీరానికి , గుండె జబ్బులకు

చక్కర వ్యాధికి , మనసులో దిగులుకి

నిద్ర పట్టటానికి , ఇంకా ఎన్నో

అయినా వాహనాలు వచ్చాక

నీతో పెద్ద అవసరము లేనే లేదు.

నివ్వు నేను దూరమైపోయాము.

నీతో 20 ,25 నిమిషాలు

గడపాలంటేనే ఎంతో కష్టం .

ఎన్ని  పనులు  ఎన్ని పనులు !

టీవీ ఫేస్బుక్ , ట్విట్టర్ ,wATsup  కె

అతుక్కు పోతున్నాము  .

నీ కోసం ఇంట్లో కూడా ట్రెడ్మిల్ లాంటి వి

పెట్టుకున్నాము, కానీ వాడేదే అరుదు ,

నీతో రొజూ 20 నిమిషాలైనా

గడపాలని ఆశి స్తూ !

నీ ఆరాధకుడు

అద్దంకి రామకృష్ణ  

ఐడియా   వెర్షన్ 1

ఒక వేసవి సంధ్యా సమయం

April 9, 2017

హైదరాబాద్ లో ఉష్ణొగ్రతలు 40’C  పైనే

మండుతున్న  సమయమంలో, చిన్ననాటి ఒక వేసవి  సాయంత్రము

మెరుపు లా మెరిసింది. అదే ఇది :

అద్దంకి రామక్రిష్ణ ,  7 ఏప్రిల్ 2017.

  ఒక   వేసవి సంధ్యా సమయం:

  పెరటిలో నీళ్ళు జల్ల గానే, అప్పటి వరుకు 

  కాగిన పుడమి తల్లి   చల్లారుతూ  మట్టి లోంచి

  వెదజల్లే  ఓ ప్రత్యేక  సువాసన లో |

  బాదం చెట్టు కింద, పట్టె మంచం వేసుకుని పడుకుని,  

  పశ్చిమాన్న   ఆకాశంలో  సప్త రంగులు   

  వెదజల్లే సూర్యభగ్వనున్ని  వీక్షిస్తూ|

  పక్కనే, లేగ దూడలతో సహా నెమరు వేస్తున్న

  గోమాతలు సహవాసాన్ని  గౌరవిస్తూ |

  అటువైపే,  విశ్వాసమైన ఓ  వూరికుక్క దాలిగుంటలో 

   ఆదమరిచి  తీసుకుంటున్న విశ్రాంతిని, ఆదరిస్తూ|

  పై చెట్టు మీదే పక్షులు, రోజల్లా  కడుపు నింపుకుని 

  గూటికి చేరిన కళకళారవాలను ఆలకిస్తూ|

   కొద్ది దూరంలో  ఉన్న గుడి లోంచి గంటలు, 

   మంత్రాల యొక్క  పుణ్య ధ్వనులను  పూజిస్తూ|

  మరో వైపు , పిల్లలు ఆటలలో

  మైమరిచి చేస్తున్న అల్లరి ఆనందం లో మమేకమై| 

  ఈ సంధ్యా సమయం అసమాన్యం,  అనన్యం,

  కోట్లకందని ఓ సంతృప్తి, అదొక దివ్యానుభూతే కదా !  ||       

Fight Noise Pollution-Abuse of Amplifiers

January 22, 2017

                     Noise Pollution- Abuse of Amplifiers/Loudspeakers

Noise pollution is very hazardous to our health. It affects one and all, but more so for the sick, elderly, children and students. There are many causes of noise pollution and the main culprit is the extensive and abusive use of amplifiers across India, among all sections of our society.

The problem was identified and highlighted many times, but the acts and remedies suggested are being implemented in a half hearted manner.   Supreme Court of India in their order in the year 2005 has stipulated certain restrictions on timings and also the levels of sound in decibels.  Unfortunately, they are implemented more in breach than in spirit.

Extract from Judgment:

Court directed that noise level at boundary of public place, where loudspeaker or public address system or any other noise source is being used shall not exceed 10 dB(A) above ambient noise standards for area or 75 dB(A) whichever is lower – beating of drum or tom-tom or blow of trumpet or beat or sound of any instrument or use of any sound amplifier at night (between 10. 00 p.m. and 6.a.m.) except in public emergencies prohibited – peripheral noise level of privately owned sound system restricted to dB(A) – blowing of vehicular horn in residential area at night hours prohibited – State directed to add chapters in text books regarding ill effects of noise pollution -State directed to specify ambient air quality standards in different areas – State also directed to seize loud speakers and amplifiers making noise beyond permissible limit.

“(10) Loudspeakers should not be allowed to be installed on towers and temple walls, churches and mosques, so as to face the surrounding streets and areas, should be installed within the precincts and turned inwards so that the music is audible only within the precincts of the temple/church/mosque. Exemption will be given during the month of Ramzan when the calls of the Muazzine for prayers is traditionally made from the mosque tower.” This decision has been approved by the Supreme Court in CHURCH OF GOD IN INDIA v.. K.K.R. MAJESTIC COLONY WELFARE ASSOCIATION [AIR 20 00 SC
2773 : 2000 (7) SCC 282].”

It is noticed that the noise pollution levels are very high during prayer calls, festivals and other occasions and become unbearable and torturing to the entire neighbourhood, including those sick in hospitals, resting elders, studying school children and even sleeping kids.  The number of amplifiers may exceed a few thousand say in a city like Hyderabad, Telangana and one can infer the noise in decibel levels during peak times.

It is therefore our sincere appeal to the Government of India, and the concerned departments, to strictly regulate and restrict the use of amplifiers throughout our country by enforcing strictly the existing laws or enacting new acts required for this purpose.  The public will greatly appreciate the peaceful surroundings and hope India will set an example in controlling noise pollution in spite of its diversity of culture and communities.