ఒక వేసవి సంధ్యా సమయం

by

హైదరాబాద్ లో ఉష్ణొగ్రతలు 40’C  పైనే

మండుతున్న  సమయమంలో, చిన్ననాటి ఒక వేసవి  సాయంత్రము

మెరుపు లా మెరిసింది. అదే ఇది :

అద్దంకి రామక్రిష్ణ ,  7 ఏప్రిల్ 2017.

  ఒక   వేసవి సంధ్యా సమయం:

  పెరటిలో నీళ్ళు జల్ల గానే, అప్పటి వరుకు 

  కాగిన పుడమి తల్లి   చల్లారుతూ  మట్టి లోంచి

  వెదజల్లే  ఓ ప్రత్యేక  సువాసన లో |

  బాదం చెట్టు కింద, పట్టె మంచం వేసుకుని పడుకుని,  

  పశ్చిమాన్న   ఆకాశంలో  సప్త రంగులు   

  వెదజల్లే సూర్యభగ్వనున్ని  వీక్షిస్తూ|

  పక్కనే, లేగ దూడలతో సహా నెమరు వేస్తున్న

  గోమాతలు సహవాసాన్ని  గౌరవిస్తూ |

  అటువైపే,  విశ్వాసమైన ఓ  వూరికుక్క దాలిగుంటలో 

   ఆదమరిచి  తీసుకుంటున్న విశ్రాంతిని, ఆదరిస్తూ|

  పై చెట్టు మీదే పక్షులు, రోజల్లా  కడుపు నింపుకుని 

  గూటికి చేరిన కళకళారవాలను ఆలకిస్తూ|

   కొద్ది దూరంలో  ఉన్న గుడి లోంచి గంటలు, 

   మంత్రాల యొక్క  పుణ్య ధ్వనులను  పూజిస్తూ|

  మరో వైపు , పిల్లలు ఆటలలో

  మైమరిచి చేస్తున్న అల్లరి ఆనందం లో మమేకమై| 

  ఈ సంధ్యా సమయం అసమాన్యం,  అనన్యం,

  కోట్లకందని ఓ సంతృప్తి, అదొక దివ్యానుభూతే కదా !  ||       

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: