Poetic thoughts on Music by ARK

by

వచన కవిత్వం
అద్దంకి రామక్రిష్ణ
6 వ అక్టొబర్ 2015

అహో! అంతు లేని మరో ప్రపంచం .

నాగరికతో పుట్టిందా లేక దేవతలు
సృష్టించిందా ఈ ప్రపంచం?
అలా మొదలైన దానికి
శబ్దమే మూలాధారం .

భాష మనుగడకు నాంది అయితే
మరి ఈ ప్రపంచం దేనికి?
ప్రకృతి తో అనుసంధానమై మరియు
జనితమైన ఈ అంతు లేని
విశ్వాన్ని ఆదరించటానికి
ఆస్వాదించటనికి మరి ఏమిటో వెనకాట

మహామహులు ఎందరో ఈ ప్రపంచాన్ని
మునిగితేలి అస్వాదించారు, ఆనందింప చేసారు
వారికి మన వందనాలు.
చెవిలో ఇయర్ఫోన్ పెట్టుకుని
ఏదో శబ్దాన్ని వింటూ మేమూ
ఉన్నాము దాంట్లో అంటే భృమే కదా?

స్వర, లయ పూరితమైన
ఈ విశ్వం లో మంచిదేమిటో
వెతకండి, దాని పుట్టు పూర్వోత్తరాలు
గ్రహించండి. అవగాహన తో వినే
శబ్దమే ఆనదాన్నికి మూలం.

ఈ ప్రపంచమలో పైపైన తేలకండి.
ఇది ఒక అంతు లేని అహో మరో ప్రపంచం!
దాని ఆరాధన, అస్వాదనే మన మనుగడకి
ముఖ్యమని గుర్తించండి.
అదే కదా సంగీత ప్రపంచం!

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s


%d bloggers like this: