Archive for May, 2011

Right talk- slokamu

May 19, 2011

 ఒక మంచి శ్లోకము మంచి మాట మీద

  
  వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ |

  వ కారైః పఞ్చభిర్యుక్తో నరో భవతి పూజితః ||

   మనిషి మీద  గౌరవము కలగాలంటే
 
   1. వస్త్రము
   2. మంచి శరీరము
   3. మంఛి మాట
   4. విద్య, సంపద, స్థితిగతులు

Bhava Kavitha

May 9, 2011

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు
     ఆదేశించిన రెండు  సూక్తుల స్ఫూర్తి తో  

     1. స్వీయ ఆరాధన   సర్వ ఆదరణ.
     2. మాధవ  సేవగా సర్వ ప్రాణి సేవ.

 
   1. గాలి, నీరు, మెతుకు,
      బట్ట, నీడ
       నీకు  అవసరం కదా
       నాకూ కావాలి
       ఔనా మానవుడా. 

  2. ప్రేమ, భక్తి,
      ఈర్ష్య, ద్వేషం
      నీలో ఉంటాయి కదా
      నాలోనూ ఉన్నాయి మరి
       ఔనా మానవుడా.

   3.  నీ ఉనికికి  కావాల్సిన
        చెట్టు, చేమ,
       వాగు, గుట్ట, జీవ కోటి
        నీ ఉనికికి ఉండాలి
        నా మనుగడకీ కావాలి
        ఔనా మానవుడా.

  4.  అందుకే, భగవంతుని సృష్టి
       ద్వారా మనము బంధువులమే
       మనకెందుకు వివాదం !
       నీదాన్ని నువ్వు పూజించుకో
       నా దాన్ని నేను పూజించుకుంటా
       అన్నిటినీ గౌరవిద్దాము.

   5.  ఒక్క మానవుడికి సేవ చెస్తే
        మాధవ సేవేనా , కాదు,
        సర్వ ప్రాణులకూ కూడా
        చేసే సేవే మాధవ
         సేవ కదూ.

     అద్దంకి రామక్రిష్ణ
      9 వ మే 2011