Archive for March, 2011

Maha Lakhmi Tirunakshatramu

March 19, 2011


  మహాలక్ష్మీ తిరునక్షత్రము

  ఫాల్గునోత్తరఫల్గున్యాం
  సంభూతాం శ్రియ మాశ్రయే |
  విష్ణోర్దివ్య పదాంభోజ
  ఘటకామ్ తత్పదాశ్రితామ్  ||

  ఫాల్గున మాసములో 
  ఉత్తరా నక్షత్రములో లక్ష్మీ దేవి
  సముద్ర మధనములో అవతరించెను.
  ఈ మాసములో శ్రీరంగం లో రంగనాయకి
  శ్రీ రంగనాథుడు కలిసి వేంచేసి ఉంటారు.
  రామనుజుల వారు వారి సన్నిధి లో
  శరణాగతి గద్య విన్న వించారు.

Advertisements

Bratuku badi -2

March 18, 2011

 
   బ్రతుకు బడి -2

  కవి: సోమిశెట్టి వేణుగోపాల్
   తరగతి గదిలో
   పెన్ను పోగొట్టుకొని
   కంటతడి పెట్టుకున్న రోజున తెలియదు
   ఆశయ సాధనలో
   అవకాశాలు చేజారినప్పుడు
   ఇంతకంటే ఎక్కువ కన్నీళ్ళు
   తలదిండును తడిపేస్తాయని !

    మాస్టారి బెత్తం దెబ్బకు
    తల్లడిల్లిన నాడు తెలియదు
    బ్రతుకు బడిలో
    నిత్యం తగిలే ఎదురుదెబ్బలతో
    అల్లాడవలసి ఉంటుందని !

     క్రమపధ్ధతి తో నేర్పించటం తప్ప
      కాలానికి జాలిపడటం
      తెలియదు కదా !

Bhava Kavithvamu- BaguMdhi

March 18, 2011

  
   బ్రతుకు బడి

   సోమిశెట్టి వేణుగోపాల్ (మల్కాపూర్)
   పలక మీద బలపంతో
  
   ‘అ, ఆ’ లు దిద్దిన రోజున తెలియదు

   జీవితంలో ఇలా దిద్దుకోలేని

   పొరపాట్లు కూడా జరుగుతాయని !
 
   బడిలో పాఠాలను

   బట్టీపట్టిన రోజున తెలియదు

   మునుముందు కాలం నేర్పబోయే
 
   గుణపాఠాలు ఇంతకంటే

   ఎంతో కఠినంగా ఉంటాయని !

    ఇంకా ఉంది

Telugulipi.Net by Vijay Ready reckoner by ARK

March 14, 2011
 
 
  అ    ఆ    ఇ   ఈ   ఉ ఊ  ఋ  ౠ 
 
   a     aa   i    ii   u    uu Ru  RU  
 
 
     ఎ   ఏ  ఐ  ఒ  ఓ  ఔ  అం  అః    అఁ  
 
     e   ee  i   o O au  aM  aH   a@m
 
    
     క   ఖ   గ   ఘ  ఙ
 
    ka Ka ga Ga  ~g
 

     చ   ఛ     జ   ఝ   ఞ
 
   cha  Cha  ja Ja   nY
 
   
   ట   ఠ    డ   ఢ   ణ
 
   ta  Ta  da  Da Na
    
  
  త   థ    ద      ధ   న
 
 tha Tha dha Dha na
 
  ప   ఫ  బ  భ మ
 
  pa Pa ba Ba  ma 

 
    య  ర ల  వ   స శ  ష  హ  ళ   ఱ   క్ష
  
   ya ra la va sa sh Sh ha La ~r xa