శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారు
ఆదేశించిన రెండు సూక్తుల స్ఫూర్తి తో
1. స్వీయ ఆరాధన సర్వ ఆదరణ.
2. మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ.
1. గాలి, నీరు, మెతుకు,
బట్ట, నీడ
నీకు అవసరం కదా
నాకూ కావాలి
ఔనా మానవుడా.
2. ప్రేమ, భక్తి,
ఈర్ష్య, ద్వేషం
నీలో ఉంటాయి కదా
నాలోనూ ఉన్నాయి మరి
ఔనా మానవుడా.
3. నీ ఉనికికి కావాల్సిన
చెట్టు, చేమ,
వాగు, గుట్ట, జీవ కోటి
నీ ఉనికికి ఉండాలి
నా మనుగడకీ కావాలి
ఔనా మానవుడా.
4. అందుకే, భగవంతుని సృష్టి
ద్వారా మనము బంధువులమే
మనకెందుకు వివాదం !
నీదాన్ని నువ్వు పూజించుకో
నా దాన్ని నేను పూజించుకుంటా
అన్నిటినీ గౌరవిద్దాము.
5. ఒక్క మానవుడికి సేవ చెస్తే
మాధవ సేవేనా , కాదు,
సర్వ ప్రాణులకూ కూడా
చేసే సేవే మాధవ
సేవ కదూ.
అద్దంకి రామక్రిష్ణ
9 వ మే 2011