బ్రతుకు బడి -2
కవి: సోమిశెట్టి వేణుగోపాల్
తరగతి గదిలో
పెన్ను పోగొట్టుకొని
కంటతడి పెట్టుకున్న రోజున తెలియదు
ఆశయ సాధనలో
అవకాశాలు చేజారినప్పుడు
ఇంతకంటే ఎక్కువ కన్నీళ్ళు
తలదిండును తడిపేస్తాయని !
మాస్టారి బెత్తం దెబ్బకు
తల్లడిల్లిన నాడు తెలియదు
బ్రతుకు బడిలో
నిత్యం తగిలే ఎదురుదెబ్బలతో
అల్లాడవలసి ఉంటుందని !
క్రమపధ్ధతి తో నేర్పించటం తప్ప
కాలానికి జాలిపడటం
తెలియదు కదా !
Advertisement